Home / Cinema News / హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరిని అడిగినా కూడా కృష్ణగారు ఎంత అందంగా వుంటారో ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుందని చెబుతారు. అయితే ఆయన తనయుడిగా తెలుగు సినీపరిశ్రమకు చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చిన కృష్ణగారి చిన్న కుమారుడు మహేష్ బాబు, చిన్న వయసులోనే తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక పెరిగి పెద్దవాడయ్యాక, మహేష్ హీరోగా పరిచయమై మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, నేడు కృష్ణగారి లాగే సూపర్ స్టార్ స్థాయికి వచ్చారు.

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

 

ఇకపోతే ఇటీవల కృష్ణ మరియు విజయ నిర్మల దంపతులు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో విజయ నిర్మల మాట్లాడుతూ, కృష్ణ మరియు మహేష్ బాబుల మధ్య గల ఒక ఆసక్తికర పోలికను బయటపెట్టారు. కృష్ణ గారు సెట్ లో పనిచేసేటపుడు అందరితో కలిసిపోతారని, అయితే కృష్ణ గారికి అమ్మాయిలంటే చాలా భయమని, హీరోయిన్లతో మాట్లాడేటపుడు కృష్ణ గారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి భయపడతారని, అలానే ఎవరైనా అమ్మాయిలతో మాట్లాడేటపుడు కూడా ఆయన తలవంచుకుని నిలబడి వారి కళ్ళల్లోకి చూడకుండా మాట్లాడతారని అన్నారు. ఇక అదే అలవాటును తాను మహేష్ బాబులో కూడా చూసినట్లు విజయ నిర్మల చెప్పారు. మహేష్ కూడా అమ్మాయిలంటే ఎంతో భయపడతాడు. వారి కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూస్తూ మాట్లాడలేడని అన్నారు. అదొక్కటే కాదని మరికొన్ని విషయాల్లో కూడా వారిద్దరిలో పోలికలున్నాయని విజయ నిర్మల అన్నారు. ‘భరత్ అనే నేను’ సినిమా ప్రమాణ స్వీకారం సన్నివేశంలో మహేష్ డైలాగులు చెబుతుంటే అచ్ఛం కృష్ణగారి వాయిస్ వింటున్నట్లు అనిపించిందని, అలానే ఒక పాటలో మహేష్ మీసం పెట్టుకున్నప్పుడు చూస్తుంటే కృష్ణగారే గుర్తుకు వచ్చారని ఆమె అన్నారు. తండ్రి కృష్ణగారి లాగానే మహేష్ కూడా మంచి మనసున్న వ్యక్తి అని, అటువంటి బిడ్డను ఏ తల్లి అయినా ఇష్టపడుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

About Admin

Check Also

కృష్ణ, విజయ నిర్మలల పెళ్లి ఎలా జరిగిందంటే...?

కృష్ణ, విజయ నిర్మలల పెళ్లి ఎలా జరిగిందంటే…?

నటశేఖర కృష్ణగారు మొదట మహేష్ బాబు తల్లి ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత విజయ నిర్మలను రెండవ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *