Home / Cinema News / కృష్ణ, విజయ నిర్మలల పెళ్లి ఎలా జరిగిందంటే…?

కృష్ణ, విజయ నిర్మలల పెళ్లి ఎలా జరిగిందంటే…?

నటశేఖర కృష్ణగారు మొదట మహేష్ బాబు తల్లి ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత విజయ నిర్మలను రెండవ వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరి వివాహం ఎలా, ఏ సందర్భంలో జరిగినది అనేది చాలా మందికి తెలియదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ నిర్మల వారి వివాహ విషయం గురించి ఇలా చెప్పుకొచ్చారు. తాను మొదట ‘సాక్షి’ సినిమాలో కృష్ణగారి పక్కన నటించానని, ఆ సినిమా షూటింగ్ ప్రఖ్యాత మీసాల కృష్ణుడు అనే గుడిలో జరిగిందని విజయ నిర్మల చెప్పారు. అయితే అక్కడకు వెళ్ళిన ఏ జంట అయినా సరే దంపతులు కావలసిందే అనే ఒక నమ్మకం ఉందట. అదే సమయంలో దర్శకుడు బాపుగారు వారిద్దరిపై ‘ తాళికట్టు శుభవేళ….’ అనే పల్లవితో సాగే పాటను చిత్రీకరించారట.

కృష్ణ, విజయనిర్మలల పెళ్లి ఎలా జరిగిందంటే...?

ఆ పాట షూటింగ్ పూర్తయ్యాక కమెడియన్ రాజబాబు, ఇక్కడ మీరిద్దరూ షూటింగ్ జరుపుకున్నారు కదా, ఇంక మీరు భార్యాభర్తలు అయినట్లే అని కృష్ణ, విజయ నిర్మలలను ఉద్దేశించి అన్నారట. ఆ తరువాత సినిమా విడుదలై విజయవంతం అవడంతో కృష్ణగారితో కలిసి చాలా చిత్రాల్లో నటించానని చెప్పారు విజయ నిర్మల. అయితే ఒకానొక చిత్ర షూటింగ్ సమయంలో నటుడు చంద్రమోహన్ విజయ నిర్మల వద్దకు వచ్చి, మిమ్మల్ని కృష్ణగారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పాడట. కానీ ఆ మాట మీరు చెప్పడం కాదు స్వయంగా కృష్ణగారు చెపితేనే చేసుకుంటాను అన్నారట విజయనిర్మల. ఇక ఆ తరువాత కృష్ణగారే నన్ను పెళ్లిచేసుకుంటావా అని అడగడంతో విజయ నిర్మల ఒప్పుకుని పెళ్లిచేసుకున్నారట. ఆ విధంగా తమ పెళ్లి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు విజయ నిర్మల. అంతేకాదు, కృష్ణగారు మంచి వ్యక్తి అని, అన్ని విషయాల్లోనూ తనకు సహాయకారిగా ఉంటారని చెప్పుకొచ్చారు విజయ నిర్మల.

About Admin

Check Also

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది...!

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది…!

ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న ఎదురు చూపులకు తెరపడనుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అమీర్ పేట …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *