Home / Cinema News / చిరుని కలవనీయడం లేదు అంటున్న ‘సైరా’ వంశీయులు!

చిరుని కలవనీయడం లేదు అంటున్న ‘సైరా’ వంశీయులు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన కెరీర్లో 151వ చిత్రం గా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఆంధ్ర ప్రాంతం నుండి అప్పటి బ్రిటిష్ పాలకులను ఎదిరించి నిలబడ్డ తొలి తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా చిత్రీకరింపడుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ మొదలుకాక ముందు నుండి ఎంతో క్రేజ్ సంపాదించిన ఈ సినిమా, ఇటీవల సోషల్ మీడియాలో ఫోటోలు లీకయ్యాక మరింత క్రేజ్ పెరిగేలా చేసిందనే చెప్పాలి.

చిరు ఫ్యామిలీని కలవనీయడం లేదు అంటున్న 'సైరా' వంశీయులు!

ఇక విషయంలోకి వెళితే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై సినిమా తీస్తున్నారు కనుక ఒకసారి చిరంజీవి మరియు రామ్ చరణ్ లను కలవటానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా కలవనీయడం లేదని నరసింహారెడ్డి వారసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాము పేదరికంలో ఉన్నామని, తమ పరిస్థితిని ఒకసారి చిరంజీవి గారికి వివరించాలని చాలాసార్లు ప్రయత్నించామని, అయినప్పటికీ కూడా అవకాశం దొరకడం లేదని ఉయ్యాలవాడ వారసుల్లో ఒకరైన బాలిరెడ్డి కుమారుడు దస్తగిరిరెడ్డి వాపోతున్నారు. బాలిరెడ్డి తాతగారికి నరసింహారెడ్డి తాతయ్య అవుతారని, మేము మా చిన్నతనంలో నరసింహారెడ్డి గారి గొప్పతనం, మరియు ధైర్య సాహసాల గురించి వింటూ పెరిగామని అన్నారు. ఒక చరిత్రకారుడి కథను తీస్తున్నప్పుడు ఆయన వంశీయులకు కూడా ప్రాధాన్యతనివ్వాలని, ఒకసారి మమ్మల్ని కలిసి మా అభిప్రాయాలు కూడా మెగాస్టార్ తెలుసుకుంటే బాగుంటుందని వారు విన్నవిస్తున్నారు. మరి వారి ఆవేదనను చిరు కానీ, చరణ్ కానీ, ఎంతమాత్రం అర్థం చేసుకుని వారికి ఆహ్వానం పలుకుతారో చూద్దాం.

About Admin

Check Also

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది...!

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది…!

ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న ఎదురు చూపులకు తెరపడనుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అమీర్ పేట …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *