Home / Beauty Tips / మెరిసే చర్మం కోసం చిట్కాలు

మెరిసే చర్మం కోసం చిట్కాలు

మెరిసే చర్మం కోసం చిట్కాలు: –

పాలు, నిమ్మరసం:-

పాలు, నిమ్మరసం కలిపి, అందులో చిటికెడు ఉప్పు కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్ప్లై చేయాలి. దీనివల్ల చర్మంలోని మురికి పోతుంది.

కీరదోసకాయ రసం, రోజ్ వాటర్:-

కీరదోసకాయ రసం, రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్ప్లై చేసి, 15నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది మీ చర్మాన్ని ఎండ నుండి కాపాడుతుంది.

పసుపు, గంధం, పాలు:-

Homemade Beauty tips for Glowing Skin

కొంచెం పసుపు, కొంచెం గంధం కలపాలి. ఈ మిశ్రమంలో పాలు కూడా వేసి, బాగా కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్ప్లై చేసి, 5 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా ఉంటుంది.

తేనె, క్రీమ్:-

కొంచెం తేనెలో క్రీమ్ కలపి, ముఖానికి పట్టించాలి. దీని వల్ల మీ ముఖం ప్రకాశిస్తుంది.

ద్రాక్ష:-

ద్రాక్ష మీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ద్రాక్ష ను మీ ముఖానికి నేరుగా అప్ప్లై చెయ్యొచ్చు లేదా ద్రాక్ష రసాన్ని మీ ముఖానికి అప్ప్లై చెయ్యొచ్చు.

టొమాటో రసం:-

మెరిసే చర్మం కోసం, టొమాటో రసం మరియు నిమ్మరసం మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.

క్యారెట్ రసం:-

క్యారెట్ రసం ముఖానికి రాసుకుంటే మిల మిల మెరిసే చర్మం మీ సొంతం.

ముల్తానిమట్టి, వేపాకులు, తులసి:-

తులసి ఆకులను, వేపాకులను పొడి చేసుకుని, అందులో ముల్తానిమట్టి, రోజ్ వాటర్, గులాబీ రేకలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమ్మాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

About Admin

Check Also

సునీల్ ఇకపై కమెడియన్ గా బిజీ కానున్నారా?

సునీల్ ఇకపై కమెడియన్ గా బిజీ కానున్నారా?

కమెడియన్ సునీల్ ఇదివరకు కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. చిన్నప్పటినుండి డాన్స్ లు మరియు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *