Home / Cinema News / కైరాను వరించిన అద్భుత అవకాశం!

కైరాను వరించిన అద్భుత అవకాశం!

భారత మాజీ సారధి, డాషింగ్ బ్యాట్స్ మెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత గాథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఎం. ఎస్. ధోని’ . ఈ చిత్రంతో మంచి పేరు సంపాదించిన కైరా అద్వానీకి మెల్లగా అవకాశాలు పుంజుకున్నాయి. ఆ తర్వాత వెంటనే కైరా ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో కైరా ప్రస్తుతం టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది. ఇక ఇప్పటికే కైరా అద్వానీ రామ్ చరణ్ మరియు బోయపాటి శ్రీనుల కలయికలో రానున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

భరత్ భామను వరించిన అద్భుత అవకాశం!

అయితే ప్రస్తుతం ఈమెకు ఒక బాలీవుడ్ భారీ ప్రాజక్టులో అవకాశం దక్కిందట. బాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ బ్యానర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో అక్షయ్ కుమార్ మరియు కరీనా కపూర్ వంటి అగ్ర తారలతో నిర్మించే చిత్రంలో కైరా అద్వానీను ఎంపిక చేసారు. కరణ్ తన చిత్రాల్లో ఎక్కువగా కొత్తవారికి అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఇప్పటికే ఎంతో పేరున్న ఇంత పెద్ద బ్యానర్ లో, అదీ సూపర్ స్టార్స్ అయిన అక్షయ్ కుమార్ మరియు కరీనాల సరసన కైరా నటించడం అంటే నిజంగా అది అదృష్టమని చెప్పాలి. ఈ చిత్రం ఏ మాత్రం కాస్త విజయాన్ని అందుకున్నా, కైరా అద్వానీ దశ తిరిగినట్లే మరి. అయితే ఈ బడా అఫర్ దక్కించుకున్న విషయాన్నీ కైరానే స్వయంగా తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలిపారు. “ఇలాంటి గొప్ప టీమ్ తో కొత్త జర్నీ స్టార్ట్ చెయ్యబోతున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.” అంటూ ఆమె ట్వీట్ చేసారు. చూద్దాం మరి.. ఈ అద్భుత అవకాశం కైరా ఎదుగుదలకు ఎంతమేరకు ఉపయోగపడుతుందో……

About Admin

Check Also

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరిని అడిగినా కూడా కృష్ణగారు ఎంత అందంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *