Home / Vantakalu / రసగుల్ల – దీపావళి స్పెషల్ స్వీట్స్

రసగుల్ల – దీపావళి స్పెషల్ స్వీట్స్

 రసగుల్ల – దీపావళి స్పెషల్ స్వీట్స్ :-

రసగుల్ల – దీపావళి స్పెషల్ స్వీట్స్

కావలసిన పదార్ధాలు:

పాలు : 1 లీటర్ లేదా 4 కప్పులు
నిమ్మరసం : 2 tsp
నీళ్ళు : 1 కప్పు
కుంకుమ పువ్వు : చిటికెడు
పంచదార పాకం కోసం:
చక్కెర : 1 కప్పు
నీళ్ళు :  2 కప్పులు

తయారుచేసే విధానం:

1.  ఒక మందపాటి గిన్నె తీసుకుని, అందులో పాలు పోసి మరిగించాలి. అందులో నిమ్మరసం వెయ్యాలి. నిమ్మరసం వెయ్యడం వల్ల పాలు విరిగిపోతాయి.
2.  ఇప్పుడు విరిగిన పాలను పల్చటి గుడ్డలో వేసి అందులోని నీళ్ళన్నీ పోయేలా గట్టిగా పిండాలి. ఈ విధంగా తయారు చేసుకున్నదాన్ని చెన్న లేదా పన్నీర్ అంటారు.
3.  ఈ పన్నీర్ మెత్తగా అయ్యేవరకు పిసుకుతూ కలపాలి. పన్నీర్ మెత్తగా అయ్యాక, కావాల్సిన సైజులో ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
4.  ఇప్పుడు గిన్నెలో నీళ్ళు, పంచదార వేసి 10 నిముషాలు సన్నని మంట మీద ఉడికించాలి. పన్నీర్ ఉండలను పంచదార పాకంలో వేసి మూత పెట్టి 15 నిముషాలు ఉడికించాలి.
5.  ఈ పన్నీర్ ఉండలు రసాన్ని పీల్చుకుని పెద్దవిగా అవుతాయి. ఈ రసగుల్లలను చల్లారనివ్వాలి. కుంకుమ పువ్వు తో గార్నిష్ చెయ్యాలి. చల్లారాక ఫ్రిజ్ లో పెట్టుకుని తింటే రసగుల్లలు బాగుంటాయి.

About Admin

Check Also

రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్

రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్

రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్ :- కావలసిన పదార్ధాలు: బొంబాయి రవ్వ : ఒక కప్పు చక్కెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *