Home / Cinema News / కేసుల సమస్యల్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్!

కేసుల సమస్యల్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్!

బిగ్ బాస్ సీజన్-2 ప్రస్తుతం మంచి ప్రేక్షకాదరణ మరియు రేటింగ్స్ తో ముందుకు సాగుతోంది. ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ షోని కొన్ని చికాకులు మాత్రం పట్టి పీడిస్తున్నాయి. అవి ఏంటంటే, షోలో పార్టిసిపేట్ చేస్తున్న కొందరు హౌస్ మేట్స్ పై కోర్టు కేసులు నమోదు కావడం అని తెలుస్తోంది. ఇక విషయం ఏమిటంటే, బిగ్ బాస్ హౌస్ మేట్స్ లోని బాబు గోగినేని, సామ్రాట్, నూతన్ నాయిడులపై కేసులు నమోదు అయ్యాయి. బాబు గోగినేని మరియు ఆయన సంస్థలోని సభ్యులు, కొందరి దగ్గర నుండి ఆధార్ వివరాలు తీసుకుని ఆ వివరాలను విదేశాలకు చేరవేస్తున్నారని, ఇది ఒక రకంగా దేశభద్రతకు ముప్పు వాటిల్లే సమస్య అని ఇటీవల ఒక వ్యక్తి బాబు గోగినేనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసాడు. అయితే ఈ విషయం కోర్టు వరకు వెళ్ళడంతో, ప్రస్తుతం బిగ్ బాస్ లో పాల్గొంటున్నందున షో నుండి బాబు గోగినేని బయటకు వచ్చేవరకు కేసును కోర్టు వాయిదా వేసింది. ఇక మరొక హౌస్ మేట్ సామ్రాట్ కు, అతని భార్య హర్షిత రెడ్డికి మధ్య వివాదాలు తలెత్తడంతో సామ్రాట్ పై అతడి భార్య వరకట్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కేసుల సమస్యల్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్!
అంతేకాక ఆయన విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్ లో ఉంది. కాగా ఈ విషయమై బిగ్ బాస్ శనివారం ఉదయం సామ్రాట్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి, కేసు తాలూకు లీగల్ నోటీసులను మిగతా హౌస్ మేట్స్ ఎవరికీ  చెప్పకుండా బయటకు వచ్చి తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక మరొక హౌస్ మేట్ నూతన్ నాయిడు తనను మోసం చేసాడని శివ అనే సామజిక కార్యకర్త ఆరోపిస్తున్నారు. తన తమ్ముడితో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టిస్తానని, అలానే వాటికి అనుమతులు ఇప్పిస్తానని తమతో నమ్మబలికి రూ.3 కోట్ల వరకు నూతన్ నాయిడు కాజేసాడని అన్నారు. అంతేకాదు నూతన్ నాయిడు తనకు నారా భువనేశ్వరి, సుజనా చౌదరి, పరకాల ప్రభాకర్ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి, త్వరలో తాను ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నట్లు నమ్మబలికి తమ నుండి డబ్బులు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరలో నూతన్ నాయిడుపై కేసు పెట్టనున్నట్లు శివ తెలిపారు. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ పై పలు విధాలుగా కేసులు వారి మెడకు చుట్టుకోవడంతో ఇవి షో నిర్వాహకులకు కొంత తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

About Admin

Check Also

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరిని అడిగినా కూడా కృష్ణగారు ఎంత అందంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *