Home / Cinema News / ‘శ్రీనివాస కళ్యాణం’లో ఆ ఐదు నిముషాల నితిన్ సీన్ హైలైట్ అట..!!

‘శ్రీనివాస కళ్యాణం’లో ఆ ఐదు నిముషాల నితిన్ సీన్ హైలైట్ అట..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నటులలో నితిన్ ఒకరు. ఇటీవల ఆయన నటించిన ‘లై’, ‘చల్ మోహన రంగ’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ తరువాత ఎలాగైనా హిట్ కొట్టాలనే తలంపుతో తన తరువాతి చిత్రాలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు నితిన్. అందులో భాగంగా గత సంక్రాంతికి చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న ‘శతమానం భవతి’ చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయనకు జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది. సుప్రసిద్ధ దర్శకుడు దిల్ రాజు తన బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'శ్రీనివాస కళ్యాణం'లో ఆ ఐదు నిముషాల నితిన్ సీన్ హైలైట్ అట..!!

కాగా మొన్న జరిగిన ఆడియో వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ, తాను నితిన్ తో ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు, ఆయన ఈ సినిమాకి సూట్ అవుతాడో లేదో ఒకసారి ఆలోచించి ప్రకటించాల్సింది అని కొందరు తనను హెచ్చరించారని అన్నారు. అయితే సినిమాలో పెళ్ళి మంత్రాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో డైలాగులను నితిన్ సరిగ్గా పలకగలరా అని కూడా కొందరు సందేహించినట్లు చెప్పారు. కాగా సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఒక సన్నివేశంలో ఐదు నిముషాల సన్నివేశాన్ని నితిన్ కేవలం ఒకే టేక్ లో పూర్తి చేయడంతో యూనిట్ మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో అభినందించారట. అంతే కాదు సినిమా మొత్తంలో నితిన్ డైలాగులు పలికిన తీరు ఆకట్టుకుంటుందని, సినిమా తప్పక విజయం సాధించి దిల్ రాజు గారి బ్యానర్ కి మరింత పేరు తీసుకొస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

About Admin

Check Also

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది...!

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది…!

ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న ఎదురు చూపులకు తెరపడనుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అమీర్ పేట …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *