Home / Political News / జగన్ తో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ…!

జగన్ తో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ…!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నటైములో రాజకీయ నాయకుల వలసలు బాగా జరుగుతున్నాయి. అయితే ఎప్పుడులాగా కాకుండా అధికార పక్షంలో నుంచి ప్రతిపక్షమైన  వైసీపీ లోకి వలసలు వెళ్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే ఈ రోజు టీడీపీ ఎంపీ పందుల రవీంద్రబాబు ఈ రోజు జగన్ కలిసి  వైసీపీలో చేరాడు. పందుల రవీంద్రబాబు చేరిన రెండు గంటల తర్వాత నార్నె శ్రీనివాసరావు జగన్ ను  లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి వద్ద కలిశారు.

జగన్ తో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ

నార్నె శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు, బంధువు. జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన  మావ అవడంతో ఈయన జగన్ కలవడంపై రాజకీయ వర్గాల్లో చాలా సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండటం, రీసెంట్ గా ఎన్టీఆర్ అక్క సుహాసిని టీడీపీ తరపున ఏమ్మెల్యేగా కూకట్ పల్లిలో పోటీ చేసిన ఎన్టీఆర్ దూరంగానే వున్నాడు. వీటన్నిటిని బట్టి చుస్తే నార్నె శ్రీనివాసరావు కూడా వైస్సార్సీపీలో చేరుతాడని రాజకీయ వర్గ్గాలలో  ప్రచారం జరుగుతుంది.

అయితే జగన్ నార్నెశ్రీనివాసరావు భేటీ తర్వాత మీడియా శ్రీనివాసరావుని జగన్ ను ఎందుకు కలిశారు అని అడగ్గా దానికి అయన పర్సనల్ పని మీద కలిసా దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధంలేదు . జగన్ తో నాకు మంచి అనుబంధం వుంది అని చెప్పారు. నార్నె శ్రీనివాసరావు మీడియాతో చెప్పినా  ఈయన  వైసీపీ లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది.

About Admin

Check Also

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది...!

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది…!

ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న ఎదురు చూపులకు తెరపడనుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అమీర్ పేట …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *