Home / Cinema News / సూపర్ స్టారూ, కేటీఆర్ గ్రీన్ ఛాలెంజ్ కి స్పందించండి సారూ…!

సూపర్ స్టారూ, కేటీఆర్ గ్రీన్ ఛాలెంజ్ కి స్పందించండి సారూ…!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మన తెలుగు వారికీ ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. కేవలం తెలుగు చిత్రాల్లో మాత్రమే నటిస్తూ, జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించిన నటుల్లో మహేష్ ముందువరుసలో వుంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అంతే కాదు కొన్నేళ్ల క్రితం వరకు ఎప్పుడూ కొంత రిజర్వుడ్గా వుండే మహేష్ బాబు, కొన్నాళ్ల నుండి సోషల్ మీడియాలో తన సినిమాలు, అలానే కుటుంబ వేడుకలు, విషయాల గురించి పోస్ట్ లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయనకు సంబందించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయన ఇటీవలి చిత్రం ‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ అవడంతో, మీడియా వేదికగా తనకు మంచి మిత్రుడు మరియు తెలంగాణ ఐటి మంత్రి అయిన కేటీఆర్ తో కలిసి కొన్ని సామజిక సమస్యలపై అయన డిబేట్ లో పాల్గొన్నారు. ఆ డిబేట్ లో పాల్గొన్న మహేష్, కేటీఆర్ పై పొగడ్తల జల్లు కురిపించారు.
సూపర్ స్టారూ, కేటీఆర్ గ్రీన్ ఛాలెంజ్ కి స్పందించండి సారూ...!
ఆ విషయం అటుంచితే ఇదివరకు ఐస్ బకెట్ ఛాలెంజ్, ఫిట్ నెస్ ఛాలెంజ్ మాదిరిగా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హరిత హారం స్పూర్తితో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతకు పాటుపడాలని అక్కడి ప్రజలు నాయకులు గ్రీన్ ఛాలెంజ్ ను రైజ్ చేసారు. ఇక ప్రస్తుతం గ్రీన్ ఛాలెంజ్ హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇటీవల కేటీఆర్ ఈ ఛాలెంజ్ ను మొత్తం ఐదుగురు సెలెబ్రిటీలపై విసరగా దాదాపుగా అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా నలుగురూ అదే రోజున ఆ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటుతూ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. ఇక మిగిలిన మహేష్ బాబు నుండి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. ఈ మధ్య ఏ విషయం పైనైనా యాక్టివ్ గా ఉంటూ స్పందిస్తున్న మహేష్, ఈ ఛాలెంజ్ విషయమై ఎందుకు మౌనం వహించారు అనేది ఎవరికి అర్ధం కాలేదు. చూడాలి మరి సూపర్ స్టార్ కేటీఆర్ గారి ఛాలెంజ్ ని రాబోయే రోజుల్లో ఏ విధంగా స్వీకరించి స్పందిస్తారో.

About Admin

Check Also

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది...!

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది…!

ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న ఎదురు చూపులకు తెరపడనుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అమీర్ పేట …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *