Home / Cinema News / బిగ్ బాస్ లో అమిత్ కు షాకింగ్ ఆఫర్ ఇచ్చిన కమల్!

బిగ్ బాస్ లో అమిత్ కు షాకింగ్ ఆఫర్ ఇచ్చిన కమల్!

బిగ్ బాస్ సీజన్ 2 ప్రస్తుతం మంచి రసవత్తరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీతో పూజ, అలానే ఆన్ లైన్ ఓటింగ్ తో శ్యామల మరియు నూతన్ నాయుడులు ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇక నిన్న లోకనాయకుడు కమల్ హాసన్ ప్రత్యేక అతిథిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే కమల్ హౌస్ లోకి ప్రవేశించగానే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి, ఒక్కొక్కరుగా కమల్ కు పాదాభివందనం చేస్తూ ఇది కలా, లేక నిజమా అని ఫీల్ అయ్యారు.
బిగ్ బాస్ లో అమిత్ కు షాకింగ్ ఆఫర్ ఇచ్చిన కమల్!
ఇక కమల్ కాసేపు హౌస్‌మేట్స్ తో మాట్లాడి ఆయన నూతన చిత్రం ‘విశ్వరూపం 2’ ట్రైలర్ ను వారికి చూపించారు. కాసేపటికి ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా కుమార్, సంగీత దర్శకుడు గిబ్రాన్, సినిమాటోగ్రాఫర్ దత్ కూడా హౌస్ లోకి రావడంతో హౌస్ అంతా కూడా సందడిగా మారింది. హౌస్ మేట్స్ తమ అనుభవాలను కాసేపు విచ్చేసిన అతిథులతో పంచుకున్నారు.
తరువాత కమల్ హాసన్ హౌస్ మేట్స్ అందరికి విశ్వరూపం టీ షర్టులను కానుకగా అందించారు. కాసేపు హౌస్ అంతా కోలాహలంగా మారింది. ఇక చివరికి హౌస్ నుండి నిష్క్రమించేముందు కమల్ హౌస్ మేట్స్ లో ఒకరికి రెండువారాల పాటు ఎలిమినేట్ కాకుండా ఉండే పవర్ ఇస్తున్నానని, అది కూడా హౌస్‌లో బాగా పేరు, కెపాసిటీ సంపాదించిన వారికీ కాకుండా కొంచెం వెనుకబడి ఉన్నవారికి ఇవాలనుకున్నాను. అందుకే నేను ఈ పవర్ ని అమిత్ తివారికి ఇస్తున్నాను అని చెప్పగానే అమిత్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. ఇక ఆ పవర్ తో అమిత్ తివారి రెండు వారాల పాటు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశం లేకుండా సేఫ్ జోన్ లో పడ్డాడు. కాగా చివరిగా కమల్ హాసన్ మాట్లాడుతూ, బిగ్ బాస్ షో పై కొందరు బయట తప్పుగా విమర్శలు చేస్తున్నారని, వారందరూ అనుకున్నట్లు ఇక్కడ ఏమీ లేదని, బయట ఏదైతే జరుగుతుందో, ఇక్కడ కూడా అదే జరుగుతుందని స్పష్టం చేసారు.ఇకపోతే కమల్ అండ్ టీమ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఒకింత జోష్ వచ్చినట్లు తెలుస్తోంది.

About Admin

Check Also

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరిని అడిగినా కూడా కృష్ణగారు ఎంత అందంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *