Home / Political News / ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది…!

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది…!

ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న ఎదురు చూపులకు తెరపడనుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైల్ ఈ వారం లోనే ప్రారంభం కానుంది.

ఈ వారం లోనే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం కానుంది...!

ఇప్పటికే  కారిడార్ 3 లో అమీర్ పేట నుంచి నాగోల్ మెట్రో రైల్ అందుబాటులో వుంది. అయితే ఇప్పుడు అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ మెట్రో రైల్ పనులు పూర్తి చేసారు. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ మెట్రో రైల్ కు కావలిసిన చాలా పరిమిషన్స్ వచ్చేసాయి. ట్రయిల్ రన్, భద్రత తనిఖీలు కూడా చేసారు. ఈ రూట్ లో మెట్రో సర్వీస్ లు ప్రారంభం అయితే నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణం చేయొచ్చు.

అయితే హైటెక్ సిటీ వద్ద ట్రైన్ రివర్స్ చేసుకునే సదుపాయం లేకపోవడం వల్ల ఈ రూట్ లో రైల్ ఒకే లైన్ లో వెళ్ళి మళ్ళీ అదే లైన్ లో తిరిగి రావలిసివుంటుంది. దానివల్ల రెండు ట్రాక్ లు ఉన్నప్పటికీ రెండు ట్రాక్స్ లో ఒకే వైపు ట్రైన్స్ వెళ్తాయి. దీనికోసం ఉప్పల్ డిపోలో ఉన్న అన్నీ బోగీలను కూడా తనిఖీలు చేసారు. ఈ వారం లోనే సీ ఎం ఆర్ ఎస్ నుంచి పర్మిషన్ వస్తుందట. పర్మిషన్ రాగానే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ ను ప్రారంభించే తేదీని నిర్ణయిస్తుందని మెట్రో రైల్ ఎమ్ డి ఎన్ వీ ఎస్ రెడ్డి చెప్పారు. కారిడార్ 2 లో జెబిఎస్ నుంచి ఎమ్ జి బి ఎస్ కు వెళ్లే మెట్రో రైల్ ను ఈ సంవత్సరం జులై కి పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికి 46 కిలో మీటర్ల మేర మెట్రో రైల్ జనాలకు అందుబాటులో ఉందని, రోజూ 1.80 లక్షల మంది మెట్రో  రైల్ వాడుతున్నారని, ఇప్పుడు ప్రారంభం కానున్న అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ మెట్రో రైల్ సిటీ రూపురేఖలనే మార్చేస్తుందని అయన చెప్పారు.

About Admin

Check Also

జగన్ తో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ

జగన్ తో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ…!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నటైములో రాజకీయ నాయకుల వలసలు బాగా జరుగుతున్నాయి. అయితే ఎప్పుడులాగా కాకుండా అధికార పక్షంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *