Home / Vantakalu / చక్కెర పొంగలి – దీపావళి స్పెషల్ స్వీట్స్

చక్కెర పొంగలి – దీపావళి స్పెషల్ స్వీట్స్

చక్కెర పొంగలి – దీపావళి స్పెషల్ స్వీట్స్ :-

చక్కెర పొంగలి - దీపావళి స్పెషల్ స్వీట్స్

కావలసిన పదార్ధాలు:

బియ్యం : 1 కప్పు
పెసర పప్పు : 1/2 కప్పు
తరిగిన బెల్లం : 1/2 కప్పు
నీళ్ళు : 4 1/2 కప్పులు
ఎండు కొబ్బరి ముక్కలు : 10
యాలకుల పొడి : 1/2 tsp
నెయ్యి : 3 tsps
జీడిపప్పు : 10
కిస్‌మిస్ : 10

తయారుచేసే విధానం:

1.  స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి పోసి ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్ వేయించాలి. అవి వేగాక, వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2.  అదే పెనంలో పెసర పప్పు వేసి ఎర్రగా వేయించాలి.
3.  ఇప్పుడు ఒక గిన్నెలో తరిగిన బెల్లం వేసి బెల్లం మునిగే వరకు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి. పాకం చిక్క బడే వరకు సన్నని మంట మీద ఉంచాలి. పాకం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి, పాకాన్ని వడకట్టాలి.
5.  మరో పాత్రలో నీళ్ళు పోసి మరిగించాలి. అందులో బియ్యం, పెసరపప్పు వేసి ఉడికించాలి.
6.  అన్నం ఉడికిన తర్వాత, మంట తగ్గించి, అందులో బెల్లం పాకం వేసి బాగా కలపాలి.
7.  ఆ తర్వాత యాలకుల పొడి, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్ లు వెయ్యాలి.
8.  ఒక 2 లేదా 3 నిముషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి. అంతే చక్కెర పొంగలి రెడీ అయినట్లే.

About Admin

Check Also

రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్

రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్

రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్ :- కావలసిన పదార్ధాలు: బొంబాయి రవ్వ : ఒక కప్పు చక్కెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *