Home / Vantakalu / బాదుషా – దీపావళి స్పెషల్ స్వీట్స్

బాదుషా – దీపావళి స్పెషల్ స్వీట్స్

బాదుషా – దీపావళి స్పెషల్ స్వీట్స్ :-

కావలసిన పదార్ధాలు:http://www.chitravedika.com/

మైదాపిండి : 250gm
బేకింగ్ పౌడర్ : 1/4 tsp
పెరుగు : 100gm
నెయ్యి లేదా డాల్డా : 50gm
నూనె: తగినంత
కుంకుమ పువ్వు, బాదం పప్పు : గార్నిష్ కోసం
పంచదార పాకం కోసం:పంచదార : 1 1/2 కప్పులు
నీళ్ళు : 1 1/2 కప్పులు
నిమ్మకాయ రసం: 1/2 tsp
యాలకుల పొడి : 1 tsp

తయారుచేసే విధానం:

1.  ఒక గిన్నెలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, నెయ్యి లేదా డాల్డా వేసి బాగా కలపాలి. తరువాత పెరుగు కూడా వేసి కలపాలి. కొంచెం నీళ్ళు పోసి చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 20 నిముషాల పాటు పక్కన పెట్టాలి. 
2.  మరో గిన్నెలో నీళ్ళు, పంచదార వేసి స్టవ్ మీద పెట్టాలి. తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి. 
3.  ఇప్పుడు ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండిని కావాల్సిన సైజులో ఉండలుగా చెయ్యాలి. ఆ ఉండలను చేతితో వత్తి మధ్యలో వేలితో నొక్కాలి. 
4.  ఇలా బాదుషాలను తయారుచేసుకున్న తర్వాత, స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె పొయ్యాలి. 
5.  నూనె కాగాక అందులో బాదుషాలను వేసి సన్నని మంట మీద బంగారు వర్ణం వచ్చేవరకు వేయించుకోవాలి. 
6.  ఇలా వేయించుకున్న బాదుషాలను పంచదార పాకంలో వేసి 10 నిముషాలు ఉంచాలి. 10 నిముషాల తర్వాత బాదుషాలను పాకం నుండి ప్లేటులోకి తీసుకోవాలి. 
7.  ఇప్పుడు బాదుషాలను కుంకుమ పువ్వు, సన్నగా తరిగిన బాదం పప్పు లతో గార్నిష్ చేసుకోవాలి. 
8.  అంతే, రుచికరమైన బాదుషాలు రెడీ అయినట్లే. ఈ బాదుషాలు 4 నుండి 5 రోజులు తాజాగా ఉంటాయి.

About Admin

Check Also

రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్

రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్

రవ్వ లడ్డు – దీపావళి స్పెషల్ స్వీట్స్ :- కావలసిన పదార్ధాలు: బొంబాయి రవ్వ : ఒక కప్పు చక్కెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *