Home / Cinema News / శ్రీదేవి వీడియో వివాదంపై బోనీ ఏమన్నారంటే?

శ్రీదేవి వీడియో వివాదంపై బోనీ ఏమన్నారంటే?

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి మరణించి నాలుగు నెలలు గడుస్తున్నా ఆమెను, ఆమె జ్ఞాపకాలను మాత్రం అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. అయితే ఢిల్లీకి చెందిన సబా ఆరిఫ్ అనే అభిమాని ఆమె మీద ఉన్న ప్రేమతో ఆమె ఫోటోల్లో కొన్ని అపురూపమైన వాటిని సేకరించి వాటన్నిటినీ కూర్చి ఒక వీడియోగా రూపొందించి దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. కాగా దానిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే, సబా ఆరిఫ్ రూపొందించిన ఆ వీడియోని ఐఫా అవార్డుల వారు ఇటీవల తమ సంస్థ నిర్వహించిన వేడుకలలో వాడుకోవడంపై (సబా ఆరిఫ్) ఫేస్‌బుక్ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేసింది.

శ్రీదేవి వీడియో వివాదంపై బోనీ ఏమన్నారంటే?

ఇక తాజాగా దీనిపై స్పందించిన శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ మాట్లాడుతూ, శ్రీదేవికి సంబంధించిన ఫోటోలపై సర్వహక్కులు తనవేనని, వాస్తవానికి తానే యశ్‌రాజ్‌ ఫిలింస్‌ వారిని సంప్రదించి ఆ వీడియోని ఐఫాకు వాడుకోమని అన్నానని చెప్పారు. మరి అలాంటపుడు సబా ఆరిఫ్ ఈ విషయమై ఐఫా వారిపై ఆరోపణలు చేస్తూ వివాదాస్పదం చెయ్యడం సరైనది కాదని, ఏదైనా సమస్య ఉంటే తనని సంప్రదించాల్సిందని అన్నారు. ఇక నేడు సబా ఆరిఫ్ బోనీ కపూర్‌ వ్యాఖ్యలపై మీడియా వారితో మాట్లాడుతూ, బోనీ కపూర్‌ గారు చెప్పినట్లు శ్రీదేవిగారి ఫోటోలపై సర్వహక్కులు వారివే, అయినప్పటికీ ఆమె ఫోటోలు, మరియు పాటల సీక్వెన్స్లు ఏ మాత్రం మార్చకుండా అలా వీడియో రూపొందించడానికి తనకు మూడురోజులు పట్టిందని, ఆ వీడియో రూపొందించబడిన విధానం మొత్తం తనదేనని, తన బాధల్లా ఏంటంటే, తన అనుమతి ఏ మాత్రం తీసుకోకుండా ఐఫా అవార్డుల వేడుకలో వీడియోను వాడడమేంటి అని సబా ఆరిఫ్ ప్రశ్నించింది. అయినా శ్రీదేవి గారి మీద ప్రేమతో రూపొందించిన ఈ వీడియోకి అంత పేరువస్తుందని తాను ఊహించలేదని సబా ఆరిఫ్ అన్నారు.

About Admin

Check Also

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

హీరోయిన్స్ విషయంలో కృష్ణ, మహేష్ లు ఒక్కటేనట!

సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరిని అడిగినా కూడా కృష్ణగారు ఎంత అందంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *